న్యూయార్క్: 2022 పారాలింపిక్స్‌లో రష్యా, బెలారస్ అథ్లెట్లపై అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిషేధం విధించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దివ్యాంగుల క్రీడల్లో ఆ రెండు దేశాల అథ్లెట్లను ఆడనివ్వబోమని పారాలింపిక్ కమిటీ వెల్లడించింది. రాజకీయ వత్తిళ్ల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐపీసీ అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్ తెలిపారు. రాజకీయాలు, క్రీడలను ఒకటిగా చూడాల్సిన అవసరం లేదని, కానీ అనివార్యంగా యుద్ధం ఈ క్రీడల్లోకి వచ్చేసిందని పార్సన్స్ తెలిపారు. రష్యా, బెలారస్ అథ్లెట్లకు క్షమాపణలు చెప్పారాయన. ఆయా దేశ ప్రభుత్వాల చర్యలకు అథ్లెట్లు బలైనట్లు ఆయన అన్నారు. రేపటి నుంచి బీజింగ్‌లో వింటర్ పారాలింపిక్స్ పోటీలు ప్రారంభంకానున్నాయి. అథ్లెట్ గ్రామాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, క్రీడాకారులకు భద్రత కల్పించడం అసాధ్యంగా ఉందన్నారు. వాస్తవానికి తొలుత ఆ రెండు దేశాలకు చెందిన అథ్లెట్లను తటస్థ వేదికపై ఆడించాలనుకున్నారు. కానీ తీవ్ర విమర్శల నేపథ్యంలో ఐపీసీ తాజా నిర్ణయం తీసుకున్నది. రష్యా నుంచి 71 మంది, బెలారస్ నుంచి 12 మంది అథ్లెట్లు పారాలింపిక్స్‌లో పోటీ పడుతున్నారు.