Paralympics 2024 : పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఈ విభాగంలో మూడు పతకాలు రాగా మరో షూటర్ సైతం ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ (SH)1లో క్వాలిఫికేషన్ రౌండ్లో రుబీనా ఫ్రాన్సిస్(Rubina Francis) అదరగొట్టింది. శనివారం జరిగిన ఈ పోటీల్లో రుబీనా 556 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించిన ఆమె పతకంపై ఆశలు రేపింది.
పారిలింపిక్స్లో భారత క్రీడాకారులు పతకాల వేటలో దూసుకెళ్తుస్తున్నారు. పోటీలు మొదలైన రెండో రోజే దేశానికి నాలుగు పతకాలు అందించారు. తొలుత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అవనీ లేఖరా(Aanvi Lekhari) పసిడితో గర్జించింది. రికార్డు స్కోర్‌తో అవనీ వరుసగా రెండో స్వర్ణంతో చరిత్ర సృష్టించింది.
అవనీ, మోనా, మనీశ్, ప్రీతి
ఇదే పోటీల్లో మోనా అగర్వాల్ (Mona Agarwal) మూడో స్థానంలో నిలిచి కంచు మోత మోగించింది. ఈ ఇద్దరి స్ఫూర్తితో అథ్లెట్ ప్రీతి పాల్ (Preethi Pal) సైతం కాంస్యంతో సంచలనం సృష్టించింది. అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి పతకం సాధించి పెట్టింది. యువ పారా షూటర్ మనీశ్ నర్వాల్ (Manish Narwal) సైతం రజతంతో మెరిశాడు. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఫైనల్లో మనీశ్ సూపర్ గురితో వెండి వెలుగులు విరజిమ్మాడు.