IMD | సెప్టెంబర్‌లో భారీగానే వానలు.. సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం : ఐఎండీ
IMD | దేశంలో సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దేశంలో దీర్ఘకాల సగటు 167.9 మిల్లీమీటర్లలో 109శాతం వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర పేర్కొన్నారు.
IMD | దేశంలో సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాపాతం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దేశంలో దీర్ఘకాల సగటు 167.9 మిల్లీమీటర్లలో 109శాతం వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర పేర్కొన్నారు. వాయువ భారత్, పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో సహా వాయువ్య ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందదన్నారు.
భారతదేశంలోని చాలాప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని.. వాయువ్య భారతంలోని కొన్ని, దక్షిణ ద్వీపకల్పంలోని అనేక ప్రాంతాలు, ఉత్తర బీహార్, ఈశాన్య ఉత్తరప్రదేశ్, అలాగే ఈశాన్య భారతదేశంలో చాలా వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది ఐఎండీ చీఫ్ వెల్లడించారు. రుతుపవన ద్రోణి సాధారణ స్థితిలోనే ఉంటుందని.. బంగాళాఖాతంలో పలు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. పశ్చిమ-వాయువ్య దిశగా రాజస్థాన్ వరకు.. ద్రోణి హిమాలయాల వైపు సైతం వెళ్లవచ్చని తెలిపారు. సెప్టెంబరులో ఈ ప్రాంతాన్ని వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావితం చేసే అవకాశం ఉందని మోహపాత్ర తెలిపారు.
ఆగస్టు వర్షపాతం సాధారణం కంటే 16 శాతం ఎక్కువ
దేశంలో ఆగస్టులో సాధారణం కంటే 16 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. వాయువ్య భారతదేశంలో 253.9 మిమీ వర్షపాతం నమోదైందని.. 2001 నుంచి ఆగస్టు ఇది రెండో అత్యధిక వర్షాపాతమని ఐఎండీ తెలిపింది. ఐఎండీ డైరెక్టర్ మోహపాత్ర మాట్లాడుతూ ఆగస్టులో దేశంలో 287.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. జూన్ ఒకటిన రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌లో 749 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. హిమాలయాల దిగువన, ఈశాన్య ప్రాంతాల్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాపాతం రికార్డయ్యింది. అల్పపీడనాలు చాలా వరకు సాధారణ స్థితికి దక్షిణంగా ఏర్పడ్డాయి. రుతుపవన ద్రోణి సాధారణ స్థితికి దక్షిణంగానే ఉందని ఐఎండీ చీఫ్ తెలిపారు. కేరళ, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా రాష్ట్రాలు లోటు వర్షాపాతం నమోదైందని పేర్కొన్నారు. ఆగస్టులో ఆరు అల్పపీడ ద్రోణులు ఏర్పడ్డాయని.. వాటిలో రెండు రుతుపవనాల అల్పపీడనాలుగా మారాయాని మృత్యుంజయ్ మోహపాత్ర వివరించారు.
Read Also :
Weather Report | వాయుగుండంగా మారిన అల్పపీడనం.. విశాఖ వద్ద నేటి అర్ధరాత్రి తీరం దాటే ఛాన్స్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

