బెంగళూరుతో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. పామ్‌లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (21) పెవిలియన్ చేరాడు. హాజిల్‌వుడ్ వేసిన పవర్‌ప్లే చివరి ఓవర్ తొలి బంతికే జైస్వాల్ అవుటయ్యాడు. హాజిల్‌వుడ్ వేసిన బంతిని ఇన్ఫీల్డ్ మీదుగా బౌండరీకి తరలించేందుకు జైస్వాల్ ప్రయత్నించాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ.. వెంటనే పక్కకు దూకి క్యాచ్ పట్టేయడంతో జైస్వాల్ మైదానం వీడాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి రాజస్థాన్ జట్టు ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.