RR vs LSG | రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ.. చివరి ఓవర్లో చెమటలు పట్టేశాయ్!
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసింది. తమ టార్గెట్‌ను కాపాడుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టు హెట్మెయర్ (59 నాటౌట్), అశ్విన్ (28), దేవదత్ పడిక్కల్ (29) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో లక్నోను ట్రెంట్ బౌల్ట్ తొలి బంతికే దెబ్బకొట్టాడు.
ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ (0)ను గోల్డెన్ డక్‌గా వెనక్కు పంపాడు. ఆ తర్వాత కృష్ణప్ప గౌతమ్ (0), జేసన్ హోల్డర్ (8) కూడా నిరాశపరిచారు. ఆదుకుంటాడనుకున్న దీపక్ హుడా (25), ఆయుష్ బదోనీ (5) కూడా వెనుతిరగడంతో లక్నో విజయంపై ఆశలు పోయాయి. అయితే క్రీజులో క్వింటన్ డీకాక్ (39), కృనాల్ పాండ్యా (22) ఉండటంతో విజయావకాశాలు పూర్తిగా మూసుకుపోలేదు.
చివర్లో మార్కస్ స్టొయినిస్ (38 నాటౌట్), దుష్మంత చమీర (13), ఆవేష్ ఖాన్ (7 నాటౌట్) పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఓవర్లో స్టొయినిస్ ఏకంగా 19 పరుగులు పిండుకోవడంతో చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం అయ్యాయి. దీంతో లక్నో గెలిచేస్తుందని అంతా అనుకున్నారు.
కానీ కొత్త కుర్రాడు కుల్దీప్ సేన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 11 పరుగులే ఇచ్చాడు. దీంతో రాజస్థాన్ జట్టు 3 పరుగుల తేడాతో లక్నోపై విజయం నమోదు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 4, ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ సేన్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
M̶u̶s̶k̶u̶r̶a̶a̶i̶y̶e̶,̶ ̶a̶a̶p̶
Muskuraane, ki wajah tum ho 🎶 pic.twitter.com/xilu40PpzS
— Rajasthan Royals (@rajasthanroyals) April 10, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ipl 2022
- RR vs LSG
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

