రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో క్వింటన్ డీకాక్ (39) కూడా అవుటయ్యాడు. చాహల్ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి అతను పెవిలియన్ చేరాడు. చాహల్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డీకాక్.. లాంగాన్‌లో రియాన్ పరాగ్ చేతికి చిక్కాడు. డీకాక్ అవుటవడంతో లక్నో విజయావకాశాలు మరింత క్లిష్టతరంగా మారాయి.
101 పరుగుల స్కోరు వద్ద లక్నో ఆరో వికెట్ రూపంలో డీకాక్ వెనుతిరిగాడు. ఆ తర్వాత అదే ఓవర్ ఐదో బంతికి కృనాల్ పాండ్యా (22)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. చాహల్ వేసిన బంతిని స్వీప్ చేయడానికి ప్రయత్నించిన కృనాల్.. బంతిని పూర్తిగా మిస్ అయ్యాడు. దాంతో ఏడో వికెట్ రూపంలో పాండ్యా మైదానం వీడాడు.