చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న జోస్ బట్లర్ (2) మరోసారి స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. సిమర్జీత్ సింగ్ వేసిన బంతిని ఆడటానికి ప్రయత్నించిన బట్లర్ విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి.. స్లిప్స్‌లో ఉన్న మొయీన్ అలీ వైపు వెళ్లింది. అతను చక్కని క్యాచ్ అందుకోవడంతో బట్లర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. రాజస్థాన్ జట్టు 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.