రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. రుతురాజ్ గైక్వాడ్ (2) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన మొయీన్ అలీ (21 బంతుల్లో 59 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాదిన అతను.. మిగతా ఐదు బంతులను బౌండరీలకు తరలించాడు.
దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఈ ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును సాధించాడు. అతను అలా రెచ్చిపోవడంతో చెన్నై జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది.