వెల్లింగ్టన్ : మూడేం డ్ల క్రితం అన్ని ఫార్మాట్లకూ రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ మాజీ సారథి రాస్ టేలర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అతడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్టు తాజాగా ప్రకటించాడు. అయితే ఈసారి టేలర్ ఆడేది న్యూజిలాండ్‌కు కాదు.. సమోవా జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహించనున్నాడు.
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్‌లో అర్హత సాధించేందుకు గాను సమోవా జట్టు ఆసియా-ఈస్ట్ ఆసియా-పసిఫిక్ టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా సమోవాకు ఆడనున్నాడు. ప్రపంచకప్‌లో అర్హత సాధించాలంటే సమోవాకు ఈ టోర్నీ కీలకం.