Rohit Sharma | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ మ్యాచ్లో 252 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా ఓపెనర్లు ఆచితూచి ఆడుతూ స్కోర్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలి పది ఓవర్లలో రోహిత్ శర్మ 49, శుభ్మన్ గిల్ 10 పరుగులతో జట్టు స్కోర్ 64 పరుగులకు చేరుకుంది. 11వ ఓవర్లో మిచెల్ శాంత్నర్ వేసిన తొలి బంతితో సింగిల్ తీసిన రోహిత్ శర్మ తన అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ అర్థ సెంచరీలో మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి.