Prithvi Shaw : భారత క్రికెట్లోకి రాకెట్లా దూసుకొచ్చిన పృథ్వీ షా (Prithvi Shaw) ఒకదశలో భావి సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. స్కూల్ డేస్‌లోనే సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డు స్కోర్‌ను బ్రేక్ చేసిన అతడు టీమిండియాకు తరగని ఆస్తి అయ్యేలా కనిపించాడు. కానీ.. సీన్ రివర్సైంది. టీనేజ్ నుంచే ఎంతో స్టార్డమ్ సంపాదించుకున్న పృథ్వీ అంతేవేగంగా పాతాళానికి పడిపోయాడు. ఈ ముంబైకర్ కెరీర్ ప్రశ్నార్థకం కావడానికి తప్పుడు తోవ పట్టడమే కారణమని రోహిత్ శర్మ చిన్నప్పటి కోచ్ దినేశ్ లాడ్ (Dinesh Lad) అన్నాడు.
సచిన్ వారసుడు, మరో సెహ్వాగ్.. ఇలా క్రీడా దిగ్గజాల ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా కెరీర్ చూస్తుండగానే తలకిందులైంది. ఎంతో ప్రతిభగల అతడు జట్టుకు దూరమవ్వడమే కాదు.. దేశవాళీలోనూ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ చిన్నప్పటి కోచ్ దినేశ్ లాడ్ ఒక పాడ్‌కాస్ట్ షోలో షా వైఫల్యానికి కారణాలను విశ్లేషించాడు. ‘నేను పృథ్వీ షాను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. పదేళ్లకే అతడు ప్రతిభగల క్రికెటర్‌గా అవతరించాడు. కానీ, అనూహ్యంగా కెరీర్‌ను సందిగ్ధంలో పడేసుకున్నాడు. ఎవరి భవిష్యత్ అయినా వారి చేతుల్లోనే ఉంటుంది.
We are delighted to welcome Prithvi Shaw, India international cricketer and U-19 World Cup-winning captain, to the Maharashtra Cricket Association. His experience and energy will be a valuable addition to our vision for excellence. @PrithviShaw | @RRPSpeaks | #TeamMaha pic.twitter.com/sRhmAXvKdW
— Maharashtra Cricket Association (@MahaCricket) July 7, 2025
అయితే.. పృథ్వీ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ, అతడు ఇప్పటికీ ప్రతిభావంతుడే. దురదృష్టవశాత్తూ ఈ యంగ్‌స్టర్ చెడు మార్గాల్లో వెళ్లి.. చేజేతులా తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు అని లాడ్ వెల్లడించాడు. చెడుతిరుగుళ్లు, క్రమశిక్షణరాహిత్యం, ఫిట్నెస్ లేమి వంటివి షా భవితవ్యాన్ని ప్రశ్నార్ధకం చేశాయ’ని లాడ్ అభిప్రాయపడ్డాడు. కారణాలతో కెరీర్ నాశనం చేసుకున్నాడు.
దినేశ్ లాడ్, రోహిత్ శర్మ
టీనేజ్ సంచలనంగా 2018లో టెస్టు అరంగేట్రం చేశాడు షా. వెస్టిండీస్‌పై రాజ్‌కోట్‌లో బరిలోకి దిగిన ఈ హిట్టర్ సెంచరీతో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. అయితే.. ఆ తర్వాత అదే జోరు చూపలేక నాలుగేళ్లకే జట్టులో చోటు కోల్పోయాడు. అనంతరం ఐపీఎల్, దేశవాళీలో పరుగుల వరద పారించిన పృథ్వీ.. పునరాగమనం చేయలేకపోయాడు. అప్పటికే ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్ వంటి కుర్రాళ్లు జట్టులోకి రావడంతో షాకు దారులు మూసుకుపోయాయి. నిరుడు రంజీ ట్రోఫీలో బెంచ్‌కే పరిమితమైన పృథ్వీ.. ఈసారి దేశవాళీలో మహారాష్ట్ర తరఫున ఆడనున్న విషయం తెలిసిందే.