BCCI Central Contract: టాప్ గ్రేడ్‌లో రోహిత్, విరాట్.. బీసీసీఐ కాంట్రాక్టు జాబితాలోకి అయ్యర్, ఇషాన్
BCCI Central Contract: టీమిండియా సీనియర్ క్రికెటర్ల కాంట్రాక్టు జాబితాను ఇవాళ భారత క్రికెట్ మండలి రిలీజ్ చేసింది. ఏ ప్లస్ కేటగిరీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. అయ్యర్, ఇషాన్ మళ్లీ లిస్టులో చోటు సంపాదించారు. జాబితాలో మొత్తం 34 మంది ఆటగాళ్లు ఉన్నారు.
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టు(BCCI Central Contract) జాబితాను బీసీసీఐ ఇవాళ రిలీజ్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు.. టాప్ కేటగిరీని రిటేన్ చేసుకున్నారు. 34 మందితో కూడిన కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషణ కూడా కాంట్రాక్టు జాబితాలో ఉన్నారు.
A+ గ్రేడ్ క్యాటగిరీలో మొత్తం నలుగురు క్రికెట్లు ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఆ లిస్టులో ఉన్నారు. A+ గ్రేడ్ ఆటగాళ్లకు రిటేన్ ఫీజు 7 కోట్లు చెల్లించనున్నారు. ఇక ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో హీరోగా నిలిచిన శ్రేయాస్ అయ్యర్.. మళ్లీ కాంట్రాక్టు జాబితాలో చోటు సంపాదించారు. అయితే అతనికి గ్రూపు బీలో స్థానం కల్పించారు. ఆ గ్రూపు ఆటగాళ్లకు మూడు కోట్లు చెల్లించనున్నారు. గత ఏడాది అయ్యర్‌ను కాంట్రాక్టు లిస్టును తొలగించారు.
ఐపీఎల్ కోసం స్వదేశీ క్రికెట్‌ను ఆడకపోవడం వల్ల గత ఏడాది అయ్యర్ణు ఆ జాబితా నుంచి తప్పించారు. ముంబై బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా గత ఏడాది ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు. అయితే ఈ సారి అతనికి గ్రూపు సీ కేటగిరీలో చోటు కల్పించారు. గ్రూపు సీ క్యాటగిరీలో ఆటగాళ్లు కాంట్రాక్టు కింద కోటి ఇవ్వనున్నారు. గత ఏడాది గ్రూపు ఏ లో ఉన్న రిషబ్ పంత్ ఈసారి గ్రూపు ఏ కేటగిరీ లో చోటు దక్కించుకున్నాడు. రిటైర్ అయిన అశ్విన్ స్థానంలో పంత్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. కేటగిరీ ఏ లో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి 5 కోట్లు ఇస్తారు.
కేటగిరీ సీ లో అత్యధికంగా 19 మంది క్రికెటర్లు ఉన్నారు. ఆ కేటగిరీలో కొత్తగా చేరిన వారిలో హర్షిత్ రాణా, వరున్ చక్రవర్తి, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
BCCI announces annual player retainership 2024-25 – Team India (Senior Men)#TeamIndia
Details 🔽https://t.co/lMjl2Ici3P pic.twitter.com/CsJHaLSeho
— BCCI (@BCCI) April 21, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

