లండన్: ఇంగ్లండ్‌తో రెండు వన్డేల్లో విఫలమైన వేళ తనపై వచ్చిన రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెడుతూ లార్డ్స్‌లో సత్తాచాటిన రోహిత్ శర్మ.. మూడో వన్డే అనంతరం వాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘దేశానికి ప్రాతినిథ్యం వహించడం, బ్యాట్‌తో జట్టుకు ఉపయోగపడేలా ఆడటమే నా పని. నా కెరీర్ ఆరంభం నుంచీ అదే చేస్తున్నా. వాటి (రిటైర్మెంట్, ఫామ్ లేమిపై వస్తున్న విమర్శలు) గురించి చాలాకాలంగా వింటున్నా.
నేను ఆడుతున్నంత కాలం అవి ఉంటాయి. అవి నా ఆటను ప్రభావితం చేయలేవు. ఫీల్డ్‌లో ఆడి జట్టును గెలిపించడమే నా పని. నా దృష్టి అంతా దానిమీదే ఉంటుంది. అయినా ఇలాంటి మసాలా లేకుంటే ఆటలో మజా ఉండదు’ అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. లార్డ్స్‌లో సెంచరీ పట్ల సంతోషం వ్యక్తం చేసిన రోహిత్.. జట్టు ఓడిపోవడం నిరాశ కల్గించిందని అన్నాడు.