శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. మనోజ్‌కుమార్ దర్శకుడు. చందు శ్రీనివాస్, సురేశ్ కొండేటి, మమత దేవేంద్ర.ఎం కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానున్నది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నటి కామాక్షి భాస్కర్ల చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
చూపించిన ప్రతివారికీ ఈ సినిమా నచ్చిందని నిర్మాతల్లో ఒకరైన చందు శ్రీనివాస్ చెప్పారు. గతంలో తాను విడుదల చేసిన ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్‌మాల్ చిత్రాల స్థాయిలో ‘ప్రేమనే ఊరిలో’ ఉంటుందని, రూపాయి పెడితే అయిదు రూపాయిల లాభం తెచ్చిపెట్టే సినిమా అవుతుందని మరో నిర్మాత సురేశ్ కొండేటి నమ్మకంగా చెప్పారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరో శ్రీరామ్, నటి తపస్విని, రమిక ఆనందం వెలిబుచ్చారు. ఇంకా సీనియర్ పాత్రికేయులు ప్రభు, రాంబాబు, గాయకుడు సాకేత్, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, కో డైరెక్టర్ శ్రుతి, మహాదేవ్ కూడా మాట్లాడారు.