చేనేతకు ఐపీఎస్‌ల సతీమణుల చేయూత
చేనేతకు చేయూతగా.. నేతన్న కుటుంబాలకు భరోసాగా.. సంప్రదాయ వస్త్రాలకు విస్తృత మారెట్ కల్పించాలనే ఉద్దేశంతో ఐపీఎస్ అధికారుల సతీమణుల సంఘం (ఐపీఎస్వోడబ్ల్యూఏ) ముందడుగు వేసింది. సంఘం అధ్యక్షురాలు లలితాఆనంద్, కార్యదర్శి రీతూజైన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పోలీసు అధికారుల మెస్, మాసబ్‌ట్యాంక్‌లో ‘థ్రెడ్స్ ఆఫ్ హోప్-వేర్ ఎవ్రీ థ్రెడ్ టెల్స్ ఏ స్టోరీ’ పేరుతో చేనేత, హస్తకళల ప్రదర్శన నిర్వహించారు.
- మాసబ్‌ట్యాంక్‌లో ‘థ్రెడ్స్ ఆఫ్ హోప్’ను ప్రారంభించిన ఐపీఎస్వోడబ్ల్యూఏ అధ్యక్షురాలు లలితాఆనంద్
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : చేనేతకు చేయూతగా.. నేతన్న కుటుంబాలకు భరోసాగా.. సంప్రదాయ వస్త్రాలకు విస్తృత మారెట్ కల్పించాలనే ఉద్దేశంతో ఐపీఎస్ అధికారుల సతీమణుల సంఘం (ఐపీఎస్వోడబ్ల్యూఏ) ముందడుగు వేసింది. సంఘం అధ్యక్షురాలు లలితాఆనంద్, కార్యదర్శి రీతూజైన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పోలీసు అధికారుల మెస్, మాసబ్‌ట్యాంక్‌లో ‘థ్రెడ్స్ ఆఫ్ హోప్-వేర్ ఎవ్రీ థ్రెడ్ టెల్స్ ఏ స్టోరీ’ పేరుతో చేనేత, హస్తకళల ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు.
జమ్దానీ, కలంకారీ, దుబ్బాక లినెన్ చీరలపై హ్యాండ్ ఎంబ్రాయిడరీతో పాటు నారాయణపేట, గద్వాల్, పోచంపల్లి, మంగళగిరి తదితర సంప్రదాయ చేనేత వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఐపీఎస్వోడబ్ల్యూ ఏ అధ్యక్షురాలు లలితాఆనంద్ మాట్లాడుతూ.. దేశ సాంస్కృతిక వారసత్వంలో సంప్రదాయ చేనేత కళలకు ప్రత్యేక స్థానం ఉన్నదని చెప్పారు. తరతరాలుగా నేత కార్మికులు, కళాకారులు తమ నైపుణ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారు. వారిని వినియోగదారులతో అనుసంధానం చేసే కార్యక్రమాలతో మరి న్ని మారెట్ అవకాశాలు లభిస్తాయని పేరొన్నారు. ఈ సందర్భంగా పలువురు చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో సుమారు రూ.13 లక్షల వ్యాపారం జరిగినట్టు నిర్వాహకులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

