అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే(AUSvIND)లో.. హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ఔటయ్యారు. ఆ ఇద్దరూ మూడో వికెట్‌కు కీలకమైన 118 రన్స్ జోడించారు. ఆ ఇద్దరూ సెంచరీల దిశగా వెళ్తున్నట్లు కనిపించినా.. అకస్మాత్తుగా ఔటయ్యారు. స్టార్క్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ అవుటవ్వగా, జంపా బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రోహిత్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 73 రన్స్ చేశాడు. ఇక శ్రేయాస్ ఏడు బౌండరీలతో 61 రన్స్ చేసి నిష్క్రమించాడు. వన్డేల్లో రోహిత్‌కు ఇది 59వ అర్థశతకం కాగా, శ్రేయాస్‌కు 23వ హాఫ్ సెంచరీ. స్పిన్నర్ జంపా తన ఖాతాలో మరో వికెట్ కూడా వేసుకున్నాడు. కేఎల్ రాహుల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తాజా సమాచారం ప్రాకం ఇండియా 39 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 రన్స్ చేసింది.