Rohit Sharma : నాగ్‌పూర్‌లో జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో మూడో రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రివ్యూ కోరిన సమయంలో తనను బిగ్ స్క్రీన్ మీద చూపించడం పట్ల భారత కెప్టెన్ రోహిత్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘బిగ్‌స్క్రీన్ మీద నన్ను ఎందుకు చూపిస్తున్నారు. రిఫరీని చూపించండి’ అని రోహిత్ సైగలు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
తొలి టెస్టులో రోహిత్ శర్మ విరోచిత సెంచరీ సాధించాడు. టెస్టుల్లో 9వ శతకం అందుకున్నాడు. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఓపికగా ఆడిన రోహిత్ 120 రన్స్ వద్ద కమిన్స్ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. తొలి వికెట్‌కు రాహుల్‌తో 76 రన్స్ జోడించాడు. చివర్లో జడేజా, అక్షర్ పటేల్ అర్థ శతకాలు బాదడంతో భారత జట్టు 400 రన్స్ చేసింది.
91 పరుగులకే ఆలౌట్
రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 91 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో టీమిండియా ఇన్నింగ్స్ 132 రన్స్‌తో ఆస్ట్రేలియాను ఓడించింది. స్పిన్నర్లకు అనుకూలించిన ఈ పిచ్‌పై అశ్విన్, జడేజా చెలరేగారు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్ జడేజా 7 వికెట్లు తీశాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇండియా 1-0 ఆధిక్యంలో ఉంది.
reminds me of when he said, tu mujhe pooch raha hai main kaun hu, tu kaun hai behenchod?🤣🤣 https://t.co/XfkPDiZdWT
— greaser (@salingerous) February 11, 2023