ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్ జరుగుతుందా.. రోహిత్ శర్మ రియాక్షన్ ఇదీ

దుబాయ్: ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్ట్ అర్ధంతరంగా రద్దయిన సంగతి తెలుసు కదా. కరోనా భయంతో టీమిండియా ప్లేయర్స్ చివరి టెస్ట్ ఆడటానికి నిరాకరించారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చెప్పింది. నాలుగు టెస్ట్‌లు ముగిసే సమయానికి టీమిండియా 2-1 లీడ్‌లో ఉంది. ఇప్పుడు ఆ చివరి టెస్ట్ జరుగుతుందా లేదా.. జరిగితే ఏకైక టెస్ట్లా జరుగుతుందా లేక ఈ సిరీస్‌లో భాగంగానా అన్నదానిపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే దీనిపై తాజాగా ఓపెనర్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సిరీస్‌లో నిజమైన విజేత ఇండియానే అని రోహిత్ స్పష్టం చేశాడు. అయితే తుది ఫలితం మాత్రం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ, ఐసీసీ తేలుస్తాయని చెప్పాడు.
ఈ సిరీస్‌లో ఇండియా తరఫున అత్యధిక స్కోరర్ రోహిత్ శర్మనే. నా దృష్టిలో ఈ సిరీస్ మేము గెలిచాము. చివరి టెస్ట్ సంగతేంటో నాకు తెలియదు. దానిని ఏకైక టెస్ట్‌లాగా ఆడతామా.. దాంతోనే సిరీస్ నిర్ణయిస్తారా తెలియదు. దానిప ఎలాంటి స్పష్టత లేదు అని రోహిత్ అన్నాడు. సోమవారం అడిడాస్ ఏర్పాటు చేసిన ఓ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. సిరీస్‌లో రోహిత్ 52 సగటుతో 368 రన్స్ చేశాడు. అంతేకాదు ఇదే సిరీస్‌లో ఇండియా బయట టెస్టుల్లో తన తొలి సెంచరీ కూడా చేయడం విశేషం. ఇంగ్లండ్ టూర్ తనకు బాగుందని, అయితే ఇదే ఉత్తమమని మాత్రం తాను చెప్పలేనని అన్నాడు. టెస్ట్ క్రికెట్లో తన బెస్ట్ రానుందని చెప్పాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

