IPL 2025 : తమకు అచ్చొచ్చిన వాంఖడేలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు దంచేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను హడలెత్తిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. సిక్సర్లతో హోరెత్తిస్తున్న ఓపెనర్ రోహిత్ శర్మ(50) అర్ధ శతకం సాధించాడు. అశ్విన్ వేసిన 12వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఎడిషన్‌లో రోహిత్‌కు ఇదే మొదటి అర్ధ శతకం.
రోహిత్ జతగా మరో ఎండ్‌లో సూర్యుకుమార్ యాదవ్ (32) తనవైన ట్రేడ్‌మార్క్ షాట్లతో బంతిని బౌండరీ దాటిస్తున్నాడు. వీళ్లిద్దరి దూకుడుతో ముంబై 12 ఓవర్లకు 112 రన్స్ కొట్టింది. ఇంకా ముంబై విజయానికి 48 బంతుల్లో 65 పరుగులు కావాలి.
FIFTY NO. 1⃣ in #TATAIPL 2025 💙
Rohit Sharma is back doing what he does the best 🫡
Updates ▶ https://t.co/v2k7Y5sIdi#MIvCSK | @ImRo45 pic.twitter.com/DQLNlD1T6b
— IndianPremierLeague (@IPL) April 20, 2025
ఛేదనలో ముంబై ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టారు. రియాన్ రికెల్టన్(24), రోహిత్ శర్మ(50)లు పోటాపోటీగా బౌండరీలు బాదారు. ఖలీల్, ఓవర్టన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్ పవర్ ప్లేలో జట్టు స్కోర్ దాటించాడు. జోరుగా ఆడుతున్నరియాన్ను జడేజా పెవిలియన్ పంపాడు. దాంతో, 63 వద్ద ముంబై తొలి వికెట్ పడింది.