చెన్నై: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీపై ముంబై ఇండియన్స్ కెప్టెన్, ఇండియన్ టీమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. స్విగ్గీని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణం స్విగ్గీ చేసిన ఓ ట్వీటే. ఎవరో ఓ వ్యక్తి చేసిన మేమ్ను స్విగ్గీ రీపోస్ట్ చేసింది. రోహిత్ శర్మ ఓ రోడ్‌సైడ్ స్టాల్లో ఉన్న వడ పావ్‌ను క్యాచ్ పట్టుకుంటున్నట్లు ఓ వ్యక్తి మేమ్ క్రియేట్ చేశాడు.
దీనిని స్విగ్గీ రీపోస్ట్ చేస్తూ ద్వేషించేవాళ్లు ఇది ఫొటోషాప్ చేసిందని అనుకుంటారు అని కామెంట్ చేసింది. ఈ ట్వీట్ చేసిన నిమిషాల్లోనే రోహిత్ శర్మ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. బాయ్‌కాట్ స్విగ్గీ పేరుతో ఓ హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేసేశారు. ఓ నేషనల్ హీరోని అవమానించేలా ఈ ట్వీట్ ఉన్నదని వాళ్లు తీవ్రంగా మండిపడ్డారు. స్విగ్గీని బ్యాన్ చేసి జొమాటోకు వెళ్లిపోతామనీ హెచ్చరించారు. క్షమాపణ చెప్పకపోతే మీ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేస్తామనీ స్పష్టం చేశారు.
దీంతో స్విగ్గీ దిగి వచ్చింది. ఎవరో ఓ వ్యక్తి చేసిన మేమ్ను తాము రీపోస్ట్ చేశామే తప్ప ఆ ఫొటోను తాము క్రియేట్ చేయలేదని, అయితే ఇంతకన్నా మంచి కామెంట్ రాసి ఉండాల్సిందని వివరణ ఇచ్చింది. తమకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదంటూ ఆ ట్వీట్‌ను డిలీజ్ చేసింది.
Dear @swiggy_in disrespecting our national hero is not acceptable.
— Rajeev Rajput🇮🇳 (@TheRoyalRaajput) April 13, 2021
Shameful act!
Do apologies or will uninstall your App
&
#BoycottSwiggy
RT pic.twitter.com/o5uGTOnzrv
Running Agendas On Social Media, Defaming National Players.
— Vivek. 🦁 (@imvikky07) April 13, 2021
This is disrespectful to a player who plays for INDIA
We all should raise our voice for this
Whether we are Dhoni fan or any other
But he plays for our country
🇮🇳🇮🇳🇮🇳
Please don't support this#Boycottswiggy pic.twitter.com/OyU41zQWpp
Uninstalling swiggy 🤡#BoycottSwiggy pic.twitter.com/jABv9L7xMo
— SOUL × ICON ❹❺™ (@Hitmann452) April 13, 2021
A special message to the Hitman’s fans
— Swiggy (@swiggy_in) April 13, 2021
We reposted a fan’s tweet in good humour. While the image was not created by us, we do admit it could’ve been worded better. It was not meant to offend anyone in the least. Needless to say, we’re always with the Paltan.
ఇవి కూడా చదవండి
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
వెనక్కి తగ్గిన అమెరికా.. భారత్‌తో భాగస్వామ్యాన్ని గౌరవిస్తామని ప్రకటన
కుంభమేళాను మర్కజ్‌తో పోల్చవద్దు..
1,84,372 కేసులు.. 1027 మరణాలు.. కరోనా విలయ తాండవం
రాష్ట్రంలో కొత్తగా 2157 కరోనా కేసులు
హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి.. రాష్ట్రపతి, ప్రధాని నివాళి