టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనర్లుగా ఎవరు వస్తే బాగుంటుంది? ఇదే ప్రశ్నపై ప్రస్తుతం క్రీడాలోకంలో పెద్ద చర్చ జరుగుతోంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత రాహుల్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవడం.. ఆసియా కప్ చివరి మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లీ సెంచరీ బాదడంతో దీనిపై పెద్ద చర్చ మొదలైంది.
రోహిత్‌కు జోడీగా కోహ్లీని ఓపెనర్‌గా పంపాలని కొందరు సలహాలు ఇస్తున్నారు. దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రోహిత్ ఈ డిబేట్‌పై క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఈ సమాధానం ఇచ్చే సమయంలో రోమిత్ చేసిన కామెంట్స్ క్రీడాభిమానులకు నవ్వు తెప్పిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్లుగా ఎవరు వస్తారని అడగ్గా.. రాహుల్, తను ఇద్దరమే ఓపెనింగ్ చేస్తామని రోహిత్ స్పష్టం చేశాడు.
అదే సమయంలో కోహ్లీని మూడో ఓపెనింగ్ ఆప్షన్‌గా ఉంచుతామని వివరించాడు. ‘ఒక్క విషయం మీకు స్పష్టం చేద్దామని అనుకుంటున్నా. మేం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నాం. లోపల ఎలాంటి కిచిడీ ఉడుకుతుందో మాకు చాలా స్పష్టంగా తెలుసు’ అని సమాధానం చెప్పాడు. ఈ కిచిడీ కామెంట్ అందరి పెదాలపై నవ్వులు పూయిస్తోంది.