FIH Junior Mens World Cup : భారత గడ్డపై హాకీ వరల్డ్ కప్ సందడికి వేళవుతోంది. ఎఫ్ఐహెచ్ జూనియర్ పురుషుల వరల్డ్ కప్ (FIH Junior Mens World Cup) తేదీ దగ్గర పడుతుండడంతో హాకీ ఇండియా 18 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. స్వదేశంలో విజేతగా నిలవాలనే లక్ష్యంతో అనుభవజ్ఞులు, ప్రతిభావంతులకు ప్రాధాన్యమిచ్చారు. డిఫెండర్, డ్రాగ్‌ఫ్లికర్ అయిన రోహిత్ (Rohit)ను కెప్టెన్‌గా ఎంపికచేశారు. భారత బృందానికి ఒలింపిక్ విజేత పీఆర్ శ్రీజేశ్ (PR Sreejesh) కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
జూనియర్ హాకీ వరల్డ్ కప్ కోసం ఇద్దరు గోల్ కీపర్లు, ఆరుగురు డిఫెండర్లు, ఆరుగురు మిడ్‌ఫీల్డర్లు, నలుగరు ఫార్వర్డ్ ఆటగాళ్లు, బ్యాకప్‌గా.. ఇద్దరిని ఎంపిక చేశారు. తమిళనాడు వేదికగా జూనియర్ హాకీ వరల్డ్ కప్ జరుగనుంది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకూ చెన్నై, మధురై కేంద్రంగా మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. పూల్ బీలో ఉన్న భారత్ లీగ్ దశలో చిలీ, స్విట్జర్లాండ్, ఒమన్ జట్లతో తలపడనుంది. మామూలుగా అయితే పూల్ బీలోనే పాకిస్థాన్ కూడా ఉండాలి. కానీ, భారత్, పాక్ మధ్య ఇటీవల కాలంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. ఒమన్‌ను ఎంపిక చేశారు.
𝐓𝐡𝐞 𝐟𝐮𝐭𝐮𝐫𝐞 𝐨𝐟 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐇𝐨𝐜𝐤𝐞𝐲 𝐢𝐬 𝐫𝐞𝐚𝐝𝐲 𝐭𝐨 𝐬𝐡𝐢𝐧𝐞! ✨
Meet the Indian Junior Men’s Team, led by Captain Rohit, for the FIH Hockey Men’s Junior World Cup Tamil Nadu 2025. 🇮🇳🏑#HockeyIndia #IndiaKaGame #FIHMensJuniorWorldCup #RisingStars pic.twitter.com/zEp6AH6xdx
— Hockey India (@TheHockeyIndia) November 14, 2025
భారత గోల్ కీపర్లు : విక్రమ్‌జిత్ సింగ్, ప్రిన్స్‌దీప్ సింగ్.
డిఫెండర్లు : రోహిత్, తలేం ప్రియబత్రా, అన్మోల్ ఎక్కా, అమిర్ అలీ, సునీల్ పలక్షప్ప బెన్నూర్, శారదానంద్ తివారీ.
మిడ్ ఫీల్డర్లు : అంకిత్ పటేల్, తౌనవోజామ్ లువాంగ్, అడ్రోహిత్ ఎక్కా, రొషన్ కుజుర్, మన్మీత్ సింగ్, గుర్జోత్ సింగ్.
ఫార్వర్డ్స్ : అర్ష్‌దీప్ సింగ్, సౌరభ్ ఆనంద్ శుష్వహ, అజీత్ యాదవ్, దిల్‌రాజ్ సింగ్.
బ్యాకప్ : రవ్నీత్ సింగ్, రోహిత్ కులు.