Vizag ODI : తనకు అచ్చొచ్చిన వైజాగ్‌లో రోహిత్ శర్మ(60 నాటౌట్) అర్ధ శతకతో కదం తొక్కాడు. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్‌లో ఆచితూచి ఆడుతున్న హిట్‌మ్యాన్ ఈ ఫార్మాట్లో 61వ హాఫ్ సెంచరీ బాదాడు. కేశవ్ మహరాజ్ ఓవర్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు రోహిత్. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి.. 271 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌కు ఇది 91వ హాఫ్ సెంచరీ. ఇదే మ్యాచ్‌లో 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడీ డాషింగ్ ఓపెనర్.
వైజాగ్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 271 పరుగుల ఛేదనలో రోహిత్ శర్మ(60 నాటౌట్) దూకుడుగా ఆడుతున్నాడు. మరో ఎండ్‌లో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(48 నాటౌట్) తడబడుతున్న వేళ సిక్సర్లు, ఫోర్లతో స్కోర్ బోర్డు వేగం పెంచాడు హిట్‌మ్యాన్. ఫుల్షాట్లతో అలరించిన రోహిత్.. మహరాజ్ ఓవర్లో సింగిల్ తీసి వన్డేల్లో 61వ అర్ధ శతకం సాధించాడు. యశస్వీతో కలిపి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు రోహిత్. 22 ఓవర్లకు భారత్ స్కోర్.. 119–0. ఇంకా విజయానికి 152 పరుగులు అవసరం.
A fine 𝗙𝗜𝗙𝗧𝗬 in the chase from Rohit Sharma 👌
His 6⃣1⃣st in ODIs 🙌
💯 partnership up for the opening wicket 🤝
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/hGPOzFLFyB
— BCCI (@BCCI) December 6, 2025