Boxing Championship : ఆసియా జూనియర్ బాక్సింగ్‌లో రోహిత్‌కు స్వర్ణం
Boxing Championship : దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మనవాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా 48 కేజీల విభాగంలో రోహిత్ చమోలి స్వర్ణం సాధించాడు. ఆదివారం జరిగిన పోటీలో...

న్యూఢిల్లీ : దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ (Boxing Championship) లో మనవాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా 48 కేజీల విభాగంలో రోహిత్ చమోలి స్వర్ణం సాధించాడు. ఆదివారం జరిగిన పోటీలో మంగోలియాకు చెందిన ఒత్‌గోన్‌బయర్ తువ్‌సింజయాను ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. తొలి రౌండ్లో ఓడిపోయిన చమోలీ తర్వాత ర్యాలీ చేసి.. 3-2 తేడాతో విజయం సాధించాడు. ఈ విషయాన్ని బాక్సింగ్ ఫెడరేషన్ తన అధికారిక ట్విట్టర్ వేదికగా వెల్లడించి రోహిత్‌కు శుభాకాంక్షలు తెలిపింది.
కాగా, గౌరవ్ సైనీ (70 కేజీలు), భరత్ జూన్ (+81 కేజీలు) కూడా పురుషుల పోటీలో బంగారు పతకాల కోసం ఇవాళ రాత్రి పోటీ పడనున్నారు. అలాగే, ముస్కాన్ (46 కేజీలు), విషు రథీ (48 కేజీలు), తను (52 కేజీలు), ఆంచల్ సైని (57 కేజీలు), నికిత (60 కేజీలు), మహి రాఘవ్ (63 కేజీలు), రుద్రిక (70 కేజీలు), ప్రాంజల్ యాదవ్ (75 కేజీలు), సంజన (81 కేజీలు), కీర్తి (+81 కేజీలు) బాలికల ఫైనల్స్‌లో పోటీపడతారు.
బాలికల సెమీ ఫైనల్స్‌లో దేవికా ఘోర్పదే (50 కేజీలు), ఆర్జూ (54 కేజీలు), సుప్రియ రావత్ (66 కేజీలు) ఓడిపోగా.. జూనియర్ ఈవెంట్లో భారత్ ఇప్పటికే ఆరు కాంస్య పతకాలు సాధించింది. బాలుర ఈవెంట్లో కాంస్యం గెలుచుకున్నది. సోమవారం మహిళల క్యాటగిరీ పోటీలు, పురుషుల ఫైనల్స్ పోటీలు జరుగనున్నాయి. 2019 లో యూఏఈలోని ఫుజైరాలో జరిగిన చివరి ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం 21 పతకాలతో (6 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి..
ఇవి తినే 109 ఏండ్లు బతికా : జాన్ టిన్నిస్వుడ్
రాముడు లేకుండా అయోధ్య లేదు : రామ్‌నాథ్ కోవింద్
నాలుగు కాళ్ల తిమింగలం దొరికిందోచ్..!
అంతర్జాతీయ విమానాలపై సస్పెన్షన్ పొడగింపు
తాలిబాన్ చేతికి అగ్రరాజ్యం ఆయుధాలు
సముద్రం నుంచి అంతరిక్షంలోకి తొలి ఫోన్ కాల్
సబ్ ఖేలే.. సబ్ ఖిలే.. మన్ కీ బాత్‌లో మోదీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

