IND vs AUS : టీ20 వరల్డ్ కప్‌లో చివరి సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా (Team India) రెండొందలు కొట్టేసింది. సెయింట్ లూయిస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (92) శివాలెత్తిపోయాడు. ఆస్ట్రేలియా(Australia) బౌలర్లను ఊచకోత కోశాడు. తన కెప్టెన్సీలో రెండు ఐసీసీ ట్రోఫీ (ICC Trophy)లు కాజేశారనే కసితోనేమో సిక్సర్లతో మోత మోగించాడు. దాంతో, పవర్ ప్లేలో టీమిండియా స్కోర్ రాకెట్ వేగంతో పరుగులు పెట్టింది. ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో రికార్డు బ్రేక్ చేసిన హిట్‌మ్యాన్ ఔటయ్యాక సూర్యకుమార్ యాదవ్(31), వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (27 నాటౌట్)లు మెరుపు బ్యాటింగ్‌తో అలరించారు. దాంతో, టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 రన్స్ కొట్టింది. తద్వారా ఈ సీజన్లో భారీ స్కోర్ నమోదు చేసింది.
పొట్టి వరల్డ్ కప్‌లో బిగ్ ఫైట్‌గా అభివర్ణించిన పోరులో కెప్టెన్ రోహిత్ శర్మ(92 : 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు ) వీరవిహారం చేశాడు. తన మార్క్ షాట్లతో బంతిని స్టాండ్స్‌లోకి పంపిస్తూ షాన్‌దార్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ(0) మరోసారి సున్నాకే కోహ్లీ వెనుదిరిగినా ఒత్తిడికి లోనవ్వలేదు.
Innings Break!
Captain Rohit Sharma led from the front as #TeamIndia post a total of 205/5 🙌
Over to our bowlers now! 👍
Scorecard ▶️ https://t.co/L78hMho6Te#T20WorldCup | #AUSvIND pic.twitter.com/djk7WWCvI6
— BCCI (@BCCI) June 24, 2024
తన పవర్ హిట్టింగ్తో హిట్‌మ్యాన్ ఆసీస్ బౌలర్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశాడు. మిచెల్ స్టార్క్ వేసిన రెండో ఓవర్లో రోహిత్ ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. వరుసగా.. 6, 6, 4, 6, బాది స్కోర్ బోర్డును ఉరికించాడు. అయితే భారత ఇన్నింగ్స్ 4.1 ఓవర్ వద్ద వాన మొదలైంది. పది నిమిషాల తర్వాత ఆట మొదలుకాగానే రోహిత్ తన బాదుడును కొనసాగించాడు.
డబుల్ హ్యాట్రిక్ హీరో ప్యాట్ కమిన్స్, జంపా, స్టోయినిస్.. ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా ఉతికేశాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లో ఫిఫ్టీతో రికార్డు బద్ధలు కొట్టాడు. రన్ రేట్ 11కు తగ్గకుండా ఆడిన రోహిత్.. రిషభ్ పంత్ (1)తో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించాడు. అయితే.. స్టోయినిస్ ఓవర్లో పంత్ బౌండరీ వద్ద హేజిల్‌వుడ్ చేతికి చిక్కడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. ఆ కాసేపటికే సెంచరీకి చేరువైన రోహిత్‌ను మిచెల్ స్టార్క్ సూపర్ యార్కర్‌తో బౌల్డ్ చేశాడు. అంతే.. బౌండరీల వర్షం వెలిసింది అన్నట్టు మిచెల్ మార్ష్ బృందం సంబురాలు చేసుకుంది.
Rohit Sharma breaks Yuvraj Singh’s sixes record 🚀
🔗 https://t.co/etvj2zKuxs | #INDvAUS pic.twitter.com/YOVK7wPPxX
— ESPNcricinfo (@ESPNcricinfo) June 24, 2024
హిట్‌మ్యాన్ ఔటయ్యాక… సూర్య(31), శివం దూబే(24)లు బౌండరీలతో చెలరేగారు. వీళ్లిద్దరి దూకుడుతో 14 ఓవర్లోనే స్కోర్ 150 దాటింది. కానీ, ఆ తర్వాత హేజిల్‌వుడ్, జంపాలు కట్టుదిట్టంగా బంతులేశారు. అంతలోనే స్టార్క్ బౌలింగ్‌లో సూర్య వికెట్ పారేసుకున్నాడు.
An exhibition of power-hitting in Saint Lucia 😍
Hardik Pandya provides the finishing touches as India score 205/5 👏#T20WorldCup | #AUSvIND | 📝: https://t.co/ks1xh6GF7E pic.twitter.com/HwaauWBV1o
— ICC (@ICC) June 24, 2024
అనంతరం హార్దిక్ పాండ్యా(27 నాటౌట్), దూబేలు కాస్త నెమ్మదిగా ఆడడంతో స్కోర్ 200 దాటడం కష్టమనిపించింది. కానీ, స్టోయినిస్ వేసిన 19వ ఓవర్లో పాండ్యా వరుసగా రెండు సిక్సర్లతో మళ్లీ ఊపు తెచ్చాడు. దూబే ఔటైనా.. రవీంద్ర జడేజా(9 నాటౌట్) 20వ ఓవర్లో సిక్సర్‌తో టీమిండియా స్కోర్ 200లు దాటింది.