Rohit-Gambhir | రాంచీలో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను 17 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో సీరియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతంగా రాణించారు. విరాట్ సెంచరీతో కదం తొక్కగా.. రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడు. మ్యాచ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్, జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి సంబంధించిన ఫొటోలు ఇంటెర్నెట్లో వెల్లువెత్తాయి. ఇద్దరు ఏదో విషయంపై సీరియస్‌గా మాట్లాడుకోవడం అందరి దృష్టి ఆకర్షించింది.
Gautam Gambhir is apologizing to Rohit Sharma & forcing him to become the captain again. Karma and sharma strikes again🔥 pic.twitter.com/KwUF1XAJzA
— Vishnu (@125notoutk) November 30, 2025
వాస్తవానికి గత కొంతకాలంగా విరాట్, రోహిత్ ఫామ్ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో జట్టులో వారి స్థానంపై ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాంచీ మ్యాచ్‌లో విరాట్, రోహిత్ ఇద్దరూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి విమర్శకుల నోళ్లను మూయించారు. కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగు చేయగా.. విరాట్ 51 బంతుల్లో 57 పరుగులు చేశాడు. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కి ఎంపికయ్యాడు. రాంచీలో తన కెరీర్లో 52వ సెంచరీ చేశాడు.
Gautam Gambhir looking so much sad when talking with Rohit Sharma pic.twitter.com/4SWpNGq6F7
— …👑 (@wtfparas) November 30, 2025
ఇదిలా ఉండగా.. మ్యాచ్ అనంతరం కెమెరాల దృష్టి డ్రెస్సింగ్ రూమ్ వైపు మళ్లింది. రోహిత్, గంభీర్ ఇద్దరు తీవ్రంగా చర్చించారు. చర్చల సమయంలో ఇద్దరు తరుచూ సైగలు చేస్తూ.. తీవ్రమైన భావాలను వ్యక్తం చేస్తూ మాట్లాడుకోవడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు యూజర్లు తమదైన శైలిలో స్పందించారు. ఇద్దరూ వ్యూహంపై చర్చించి ఉండవచ్చని ఓ యూజర్ స్పందించాడు. మరో యూజర్ రోహిత్ శర్మకు గౌతమ్ గంభీర్ క్షమాపణలు చెబుతున్నాడని.. మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలని బలవంతం చేస్తున్నాడని కామెంట్ చేశాడు. రోహిత్ శర్మతో మాట్లాడుతున్నప్పుడు గౌతమ్ గంభీర్ చాలా విచారంగా కనిపిస్తున్నాడని మరొకరు స్పందించారు.
Rohit Sharma reaction when Kohli tried to take risky single.
“Aaram se bhai, aaram se.” 😭🔥 pic.twitter.com/eh3SpN5s19
— Rohan💫 (@rohann__45) November 30, 2025
ఇదిలా ఉండగా.. రాంచీ వన్డేలో టాస్ ఓడిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తలిగింది. కేవలం 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, టెయిలెండర్స్ రాణించడంతో 49.2 ఓవర్లలో 332 పరుగులు చేసింది. కేవలం 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మార్కో జాన్సెన్ 39 బంతుల్లో 70 పరుగులు, కార్బిన్ బాష్ 51 బంతుల్లో 67 పరుగులు చేశాడు. భారత్ తరఫున హర్షిత్ రాణాకు మూడు వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి.