హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం కొచ్చి బ్లూస్పైకర్స్తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 4-1(15-12, 15-11, 15-11, 15-10, 13-15)తేడాతో కొచ్చిపై ఘన విజయం సాధించింది. దీంతో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని లీగ్‌లో శుభారంభం చేసింది. మ్యాచ్‌లో ఆది నుంచి తమదైన దూకుడు కనబరిచిన హైదరాబాద్ తరఫున రోహిత్ కుమార్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. తొలి సెట్లో 1-3తో వెనుకంజలో ఉన్న హైదరాబాద్ అద్భుతంగా పుంజుకుంది. రోహిత్‌కుమార్ అద్భుతమైన ఆటతీరుతో బ్లాక్‌హాక్స్ వరుస పాయింట్లు కొల్లగొట్టి మొదటి సెట్‌ను కైవసం చేసుకుంది. ఇక్కణ్నుంచి రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ప్రతి పాయింట్ కోసం ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడ్డాయి. అంతకుముం దు పీవీఎల్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్టార్ షట్లర్ పీవీ సింధుతో పాటు సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఆయా జట్ల యజమానులు పాల్గొన్నారు.