పారిస్: రోహన్ బోపన్న (భారత్), మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం పారిస్ మాస్టర్స్ క్వార్టర్స్‌లో నిష్క్రమించింది. పురుషుల డబుల్స్‌లో బోపన్న-ఎబ్డెన్ జోడీ.. 6-7 (13/15), 5-7తో వెస్లీ కూల్‌హాఫ్ (నెదర్లాండ్), నికోల మెక్టిక్ (క్రొయేషియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.
సుమారు రెండు గంటల పాటు సాగిన హోరాహోరి పోరులో తొలి సెట్లోనే టై బ్రేక్‌కు దారి తీసింది. రెండో సెట్లోనే పోరాడినా డచ్, క్రొయేషియా జంట జోరుతో బోపన్న జంటకు ఓటమి తప్పలేదు.