Roger Federer : మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్ (Rafael Nadal) తన వీడ్కోలు నిర్ణయంతో అందర్నీ షాక్‌కు గురి చేశాడు. సుదీర్ఘ కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుపొందిన రఫా టెన్నిస్‌లో గొప్ప ఆటగాడిగా తన శకాన్ని ముగించాడు. ఈ సందర్భంగా టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్(Roger Federer) స్పందిస్తూ నాదల్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. కోర్టులో తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చినందుకు స్పెయిన్ బుల్‌కు ఫెదరర్ ధన్యవాదాలు తెలిపాడు.
‘ఎంత అద్భుతమైన కెరీర్ రఫా. నేను ఎల్లప్పుడూ అనుకునేవాడిని ఈ రోజు రావొద్దని. నాకు ఎన్నో మరపురాని జ్ఞాపకాలను అందించిన నీకు ధన్యవాదాలు. నువ్వు సాధించిన ఘనతలను మేముంతో ఇష్టపడుతాం. ఇది నిజంగా ఎంతో గొప్ప గౌరవం’ అని ఫెదరర్ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. టెన్నిస్‌లో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా పేరొందిన ఫెదరర్ 2022లో ఆటకు అల్విదా పలికిన విషయం తెలిసిందే.
There will never be another Rafael Nadal pic.twitter.com/6zpyU6OKh6
— Bastien Fachan (@BastienFachan) October 10, 2024
పురుషుల టెన్నిస్‌లో కోర్టులో బద్ధ శత్రువులుగా, బయట మంచి స్నేహితులగా అభిమానుల మనసులు గెలిచారు నాదల్, ఫెదరర్‌లు. వీళ్లిద్దరూ తొలిసారి 2004లో మియామి ఓపెన్‌లో ఎదురుపడ్డారు. పదిహేనేండ్ల కాలంలో ఈ దిగ్గజాలు 40 మ్యాచుల్లో తలపడ్డారు. మరి పైచేయి ఎవరిదో తెలుసా?.. నాదల్‌దే. 2019లో రఫా 24-16తో ఫెదరర్‌పై తన ఆధిపత్యం చెలాయించాడు. అయితే.. ఇద్దరూ చివరిసారి 2022 వింబుల్డన్‌లో ఆడగా.. స్విస్ స్టార్ 7-6, 1-6, 6-3, 6-4తో నాదల్‌ను చిత్తు చేశాడు.