ఢిల్లీ : రాజస్థాన్ రాయల్స్ సారథి రియాన్ పరాగ్ చిక్కుల్లో పడ్డాడు. పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో అతడు ఈ-సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం స్టేడియం, డ్రెస్సింగ్ రూమ్‌లో ధూమపానం అనుమతి లేదు. అదీగాక భారత్‌లో ఎలక్ట్రానిక్ సిగరెట్ల అమ్మకాలపై నిషేధం ఉంది. విచారణలో గనుక పరాగ్ ఈ చర్యకు పాల్పడ్డాడని తేలితే మాత్రం అతడిపై కఠిన శిక్ష పడే అవకాశముంది.