ద్వారక: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ విద్యాశాఖ మంత్రి రివాబా జడేజా( Rivaba Jadeja) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ద్వారకలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. క్రికెటర్లలో వ్యసనపరులు ఉన్నారని, కానీ తన భర్త రవీంద్ర జడేజా మాత్రం మంచి వ్యక్తి అని మెచ్చుకున్నారు. రవీంద్ర జడేజా క్రికెట్ ఆడేందుకు లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు పర్యటిస్తుంటాడని, అయినా అతనేమీ చెడు అలవాట్లకు లోను కాలేదని, అతనికి ఎటువంటి దుర్గుణాలు లేవని, ఎందుకంటే అతనికి బాధ్యతలు తెలుసు అని, కానీ జట్టులోని సభ్యులకు మాత్రం దురఅలవాట్లు ఉన్నట్లు ఆమె ఆరోపించారు.
అయినా అలాంటి క్రికెటర్ల మీద ఎటువంటి ఆంక్షలు లేవని రివాబా చెప్పారు. గత 12 ఏళ్లుగా తన భర్త దేశవిదేశాల్లో క్రికెట్ ఆడుతున్నారని, అతను ఏం కావాలనుకున్నా చేయగలడని, కానీ అతని బాధ్యతను అతను గుర్తించగలడని, ఏం చేయాలో అది చేస్తాడని మంత్రి రివాబా జడేజా అన్నారు. భర్తను మెచ్చుకునే క్రమంలో మిగితా ప్లేయర్లను వ్యసనపరులను చేసిన ఆమె వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. క్రికెటర్ జడేజా జట్టు సభ్యులను చులకన చేసి మాట్లాడినట్లుగా ఉందన్నారు.
ప్రస్తుతం రవీంద్ర జడేజా కేవలం టెస్టు, వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. అతను టీ20లకు దూరం అయ్యాడు. ఇక ఐపీఎల్ కేరీర్లోనూ అతను జట్టును మార్చేస్తున్నాడు. వచ్చే సీజన్ నుంచి అతను చెన్నైను వదిలేసి రాజస్థాన్ రాయల్స్‌కు ఆడనున్నాడు.
“मेरे पति (रवींद्र जडेजा , क्रिकेटर)को लंदन , दुबई, ऑस्ट्रेलिया जैसे अनेकों देशों में खेलने के लिए जाना होता है फिर भी आज दिन तक उन्होंने कभी व्यसन नहीं किया क्योंकि वो अपनी जवाबदारी को समझते हैं @Rivaba4BJP जी , शिक्षा मंत्री गुजरात सरकार #Rivabajadeja #ravindrajadeja pic.twitter.com/OyuiPFPvVa
— राणसिंह राजपुरोहित (@ransinghBJP) December 10, 2025