హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జాతీయ స్థాయిలో వరుస టైటిల్స్‌తో అదరగొడుతున్న తెలంగాణ యువ టెన్నిస్ క్రీడాకారిణి బసిరెడ్డి రిషిత రెడ్డి మరోసారి సత్తా చాటింది. పూణెలో ఈనెల 2-7 తేదీలలో జరిగిన ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స్-జే100 గర్ల్స్ సింగిల్స్ టైటిల్‌ను ఆమె కైవసం చేసుకుంది.
గర్ల్స్ సింగిల్స్ ఫైనల్లో రిషిత.. 6-2, 7-5తో అయో వటనబె (జపాన్)ను వరుస సెట్లలో చిత్తు చేసి మరో జూనియర్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఇది ఆమెకు వరుసగా మూడో టైటిల్ కావడం విశేషం.