సెంచూరియన్: వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొత్త మైలురాయిని అందుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో ఈ రికార్డును నమోదు చేశాడు. అతి తక్కువ టెస్టు మ్యాచుల్లో 100 క్యాచ్‌లు అందుకున్న ఇండియన్ కీపర్‌గా నిలిచాడు. గతంలో ధోనీ పేరిట ఉన్న రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. రిషబ్ పంత్ కేవలం 26 టెస్టుల్లో వంద క్యాచ్‌లను పట్టేశాడు. అయితే ధోనీ ఆ రికార్డును 36 టెస్టుల్లో అందుకున్నాడు. ఇక ఓవరాల్ లిస్టులో మాత్రం సౌతాఫ్రికా కీపర్ క్వింటన్ డీకాక్ ముందంజలో ఉన్నాడు. కేవలం 22 టెస్టుల్లోనే అతను వంద క్యాచ్‌లు పట్టుకున్నాడు. టెస్టుల్లో వంద క్యాచ్‌లు పట్టిన ఇండియన్లలో పంత్ ఆరవ ప్లేయర్. గతంలో ధోనీ, కిర్మాణి, కిరణ్ మోరే, నయన్ మోంగియా, వృద్ధిమాన్ సాహాలు ఈ ఘనతను సాధించారు. టెస్టుల్లో ధోనీ అత్యధికంగా 294 క్యాచ్‌లను పట్టుకున్నాడు.