బ్రిస్బేన్: టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్మప్ మ్యాచ్‌లో రిషబ్ పంత్(Rishabh Pant:) ఆడలేదు. ఆ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ కీపింగ్ బాధ్యతలను చేపట్టారు. భారత్ ఏడు వికెట్లు కోల్పోయినా.. అతను మాత్రం బ్యాటింగ్ కూడా చేయలేదు. కానీ ప్లేయర్లు కూర్చునే డగౌట్ ప్రాంతంలో పంత్ కనిపించాడు.
కుడి కాలు మోకాలికి స్ట్రాప్ పెట్టుకుని పంత్ కూర్చున్నాడు. ఐస్ ప్యాక్ కూడా పంత్ పెట్టుకున్నట్లు కనిపించాడు. ఇప్పుడు ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది. దీంతో అతను తీవ్రమైన మోకాలి సమస్యతో బాధపడుతున్నాడో ఏమో అన్న సందేహం వ్యక్తం అవుతోంది.
మోకాలికి స్ట్రాప్‌తో ఉన్న ఫోటో వైరల్ కావడంతో పంత్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్‌కప్ మ్యాచుల్లో అతను ఆడుతాడో లేదో అన్న డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు.