హైదరాబాద్ : న్యూజిలాండ్‌తో సిరీస్‌కు(IND vs NZ) ముందే భారత్ ఎదురదెబ్బ తగిలింది. వికెట్ కీపర్ రిషబ్(Rishabh Pant)గాయంతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. శనివారం ప్రాక్టీస్ సెషన్లో కడుపులో నొప్పి రావడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. అతడికి ఎంఆర్ఐ స్కాన్ చేయించామని, పంత్ ఆరోగ్య పరిస్థితినిబ బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 11 నుంచి వడోదరాలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పంత్ ఆడే అవకాశం లేదని బీసీసీఐ అధికారికంగా స్పష్టం చేసింది. అతడి స్థానంలో ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో రాణించిన ధ్రువ్ జురేల్‌ను టీంలోకి తీసుకున్నారు. వన్డే జట్టులో జురేల్ రిజర్వ్ వికెట్ కీపర్‌గా ఉంటాడు. కాగా, న్యూజిలాండ్‌తో తొలి వన్డే వడోదర వేదికగా నేడు(జనవరి11) మధ్యాహ్నం 1: 30 గంటలకు ప్రారంభం కానుంది.
భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (సి), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, యశస్తి జైస్వాల్, ధ్రువ్ జురేల్,హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ,