బెంగుళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు(Ind Vs Nz)లో.. ఇవాళ రిషబ్ పంత్ ఓ దశలో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. సర్ఫరాజన్ ఖాన్ స్క్వేర్ కట్ కొట్టి ఓ పరుగు తీశాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న రిషబ్ ఫస్ట్ రన్ ఈజీగా తీశాడు. అయితే సర్ఫరాజ్‌ను చూడకుండా రిషబ్ రెండో రన్‌కు ట్రై చేశాడు. వికెట్ కీపర్ నుంచి పిచ్‌పై కొంత దూరం పరిగెత్తాడు. ఆ సమయంలో నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న సర్ఫరాజ్.. అరుస్తూ పంత్‌ను పరుగు తీయకుండా చేశాడు. వద్దు వద్దు అంటూ సర్ఫరాజ్ గెంతులు వేస్తూ కివీస్ ఫీల్డర్లను కన్ఫ్యూజ్ చేశాడు. స్టాండ్స్ నుంచి ఇదంతా చూసిన క్రికెటర్లు రోహిత్, అశ్విన్ నవ్వుకున్నారు.
Rishabh bhai, Run out is the last thing we need brother.
Sarfaraz jumping helped distract the wicket keeper.#INDvNZ pic.twitter.com/J2BaKWyVwr
— Ankit (@2dPointtt) October 19, 2024
మొత్తం మీద రనౌట్ కాకుండా పంత్ తన వికెట్‌ను కాపాడుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఇవాళ తొలి సెషన్లో జోరును ప్రదర్శించారు. నాలుగు వికెట్‌కు ఇప్పటి వరకు అజేయంగా 113 రన్స్ చేశారు. సర్ఫరాజ్ ఖాన్ 125, పంత్ 53 రన్స్ చేసి క్రీజ్‌లో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 12 పరుగులు వెనుకబడి ఉన్నది. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియంలో వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ నిలిపివేశారు.
🤣🤣 https://t.co/ThCCxMp1yD pic.twitter.com/ymjEvBO0b4
— mon (@4sacinom) October 19, 2024