IPL 2023 : టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) మళ్లీ స్టేడియంలో సందడి చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), ముంబై ఇండియన్స్(Mumabi Indians) మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అతను ఈసారి బెంగళూరులో కనిపించాడు. చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను కలిసి వాళ్లతో సరదాగా ముచ్చటించాడు.
వరుస ఓటములతో సతమతవుతున్న టీమ్ సభ్యులలో ఉత్సాహం నింపాడు. సహచర ఆటగాళ్లలో పంత్ మైదానంలో ఉన్న ఫొటోలను ఐపీఎల్ యాజామన్యం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
Look who made a visit to the @DelhiCapitals training here in Bengaluru 😃
Hello there @RishabhPant17 👋#TATAIPL | #RCBvDC pic.twitter.com/HOFjs8J9Iu
— IndianPremierLeague (@IPL) April 14, 2023
డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ 16వ సీజన్లో ఢిల్లీ ఇంకా బోణీ కొట్టలేదు. వరుసగా నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఆ జట్టు శనివారం(ఏప్రిల్ 15న) రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. వరుసగా రెండు మ్యాచుల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల చేతిలో కంగుతిన్న ఆర్సీబీ విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఖాతా తెరవాలని ఢిల్లీ, సొంత మైదానంలో పరుపు కాపాడుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నాయి. దాంతో, ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది.
Dc F
గత ఏడాది డిసెంబర్ 31న రిషభ్ పంత్ కారు యాక్సిడెంట్లో గాయపడ్డాడు. దాంతో అతను ఈ ఏడాది మొత్తం క్రికెట్‌కు దూరం కానున్నాడు. ముఖ్యమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC Final 2023), వన్డే వరల్డ్ కప్(ODI WC 2023)లలో కూడా ఈ స్టార్ ప్లేయర్ ఆడేది అనుమానమే. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో మోకాలికి సర్జరీ చేయించుకున్న అతను ఈమధ్యే నడవడం సాధన చేస్తున్నాడు. కర్రల సాయంతో నడుస్తున్న అతడి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు చికిత్సలో భాగంగా స్విమ్మింగ్ పూల్‌లో అడుగులేస్తున్న ఫొటోలను పంత్ ఆన్లైన్లో పెట్టాడు. పంత్ ఐపీఎల్‌కు దూరం కావడంతో డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్నారు.