లార్డ్స్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడవ టెస్టు ఆఖరి రోజు ఆట రసవత్తరంగా మారింది. 193 రన్స్ టార్గెట్‌తో బ్యాటింగ్ చేస్తున్న ఇండియా.. ఇవాళ ఉదయం కీలకమైన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వికెట్లను కోల్పోయింది. ఆర్బర్ బౌలింగ్ పంత్ 9 రన్స్ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రాహుల్ 389 రన్స్ చేసి నిష్క్రమించాడు.
చివరి రోజు ఆటపై రెండు జట్లు పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇంగ్లండ్ బౌలర్లు.. భారత బ్యాటర్లు .. ఫలితం కోసం ట్రై చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇండియా 24 ఓవర్లలో 81 రన్స్ చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. గెలుపు కోసం ఇంకా ఇండియా 112 రన్స్ చేయాల్సి ఉంది. మరో 4 వికెట్లు తీస్తే ఇంగ్లండ్‌దే విక్టరీ అవుతుంది. ప్రస్తుతం జడేజా, సుందర్ క్రీజ్‌లో ఉన్నారు.
Stumps knocked back! 💥
And some chat 🗣
BIG wicket ☝ pic.twitter.com/JiJjkzJByX— England Cricket (@englandcricket) July 14, 2025