సిడ్నీ: సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్.. వేగంగా హాఫ్ సెంచరీ చేశాడు. 29 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దాంట్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా పంత్ హాఫ్ సెంచరీ చేయడం ఇది రెండోసారి. గతంలో కేవలం 28 బంతుల్లోనే ఓ సారి అర్థశతకాన్ని నమోదు చేశాడతను. కానీ 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను క్యాచ్ అవుట్ అయ్యాడు. కమ్మిన్స్ బౌలింగ్‌లో కట్ షాట్ ఆడబోయిన అతను కీపర్‌కు క్యాచ్ ఇచ్చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పంత్ 98 బంతుల్లో 40 రన్స్ చేశాడు. దీంతో భారత్ ప్రస్తుతం 23 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 రన్స్ చేసింది. భారత్ 129 పరుగుల ఆధిక్యంలో ఉన్నది.
How’s that for a crowd catch at the SCG? #AUSvIND pic.twitter.com/uSWadbXNpP
— cricket.com.au (@cricketcomau) January 4, 2025