ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసిన రిషబ్ పంత్

లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత బయో బబుల్ నుంచి బయటకు వచ్చిన టీమిండియా క్రికెటర్లు యూకేలో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమకు దొరికిన ఈ టైమ్‌ను హాయిగా గడపడానికి ప్రయత్నిస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్కతో కలిసి ఉండగా.. రోహిత్ శర్మ, అజింక్య రహానే కూడా ఫ్యామిలీస్‌తో కలిసి యూకేలో సైట్ సీయింగ్‌కు వెళ్లారు. మరోవైపు వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న యూరో 2020 మ్యాచ్ చూడటానికి వెళ్లాడు. మంగళవారం రాత్రి లండన్‌లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్, జర్మనీ మధ్య జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్ చూడటానికి పంత్ వెళ్లాడు.
తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లిన పంత్ అక్కడ సెల్ఫీలతో సందడి చేశాడు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంగ్లండ్, జర్మనీ మ్యాచ్ చూడటం మంచి అనుభూతిని కలిగించిందంటూ ఈ ఫొటోలు అతడు ట్వీట్ చేశాడు. అది చూసి అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు అభిమానులు. ఏ టీమ్‌కు సపోర్ట్ చేశావని ఒకరు, మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని మరొకరు అడిగారు. పంత్‌తోపాటు ఉన్న వాళ్లు ఇంగ్లండ్ జెర్సీలో కనిపించారు. ఈ మ్యాచ్‌లో ఆ టీమ్ 2-0తో జర్మనీని ఓడించింది.
Good experience watching ⚽️. 🏴 vs 🇩🇪 pic.twitter.com/LvOYex5svE
— Rishabh Pant (@RishabhPant17) June 30, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

