Duleep Trophy 2024 : దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ రెండు రోజుల్లో మొదలవ్వనుంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపికైన వాళ్లు విశ్రాంతి తీసుకోనున్నారు. అందుకని దులీప్ ట్రోఫీ నుంచి ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal), వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant)లతో పలువురు ఆటగాళ్లకు బీసీసీఐ బ్రేక్ ఇచ్చింది. మంగళవారం బీసీసీఐ దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ కోసం స్క్వాడ్‌ను ప్రకటించింది.
ఇండియా బీ తరఫున ఫినిషర్ రింకూ సింగ్(Rinku Singh) ఆడనున్నాడు. ఓపెనర్ మయంక్ అగర్వాల్ ఇండియా ఏ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 12 నుంచి దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ జరుగనుంది. ఈసారి ఇండియా బీ తరఫున పంత్ బదులు రింకూ బరిలోకి దిగనున్నాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ స్థానలో సుయాశ్ ప్రభుదేశాయ్ ఆడనున్నాడు. ఇండియా ఏ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ నుంచి మయాంక్ అగర్వాల్ పగ్గాలు అందుకోనున్నాడు.
🚨 News 🚨
Squads for second round of #DuleepTrophy 2024-25 announced.
Details 🔽 @IDFCFIRSTBank https://t.co/yzuivNlrmg
— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2024
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు స్క్వాడ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, అకాశ్ దీప్, అక్షర్ పటేల్‌లు సైతం దులీప్ ట్రోఫీ రెండో రౌండ్లో ఆడడం లేదు. తొలి రౌండ్లో ఇండియా ఏపై ఇండియా బీ, ఇండియా డీపై ఇండియా సీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.