జాన్పూర్ (యూపీ) : టీమ్ఇండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలోనే పెండ్లిపీటలెక్కనున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషెహర్ లోక్‌సభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ ఏడడుగులు వేయనున్నాడు. ఈనెల 08న వీరిద్దరి నిశ్చితార్థం జరుగనుంది.
ఈ విషయాన్ని ప్రియా సరోజ్ తండ్రి, మాజీ ఎంపీ తుఫానీ సరోజ్ తెలిపారు. జూన్ 08న లక్నోలోని ఓ హోటల్లో తమ బంధుమిత్రుల సమక్షంలో రింకూ-ప్రియ ఎంగేజ్మెంట్ జరుగనుండగా నవంబర్ 18న వారణాసిలోని తాజ్ హోటల్లో పెండ్లికి ముహూర్తం నిశ్చయించినట్టు తుఫానీ తెలిపారు.