కోబ్: ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రింకూ హుడా ఆకట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల ఎఫ్46 జావెలిన్ త్రో విభాగంలో రింకూ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో రౌండ్లో రింకూ 62.77మీటర్ల దూరం విసిరి టాప్-3లో చోటు దక్కించుకున్నాడు.
అయితే రెండో స్థానంలో నిలిచిన ప్రియాంత హెరాత్ (64.59మీ)..టాప్లో ఉన్న గులెర్మో వెరోనా గొంజాలెజ్(65.61మీ)పై ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారిక ఫలితాలు వెల్లిండించకుండా నిలిపివేశారు. ఇదిలా ఉంటే భారత్ గత రికార్డులను తిరుగరాస్తూ ప్రస్తుతం 12 పతకాల(5స్వర్ణాలు, 4రజతాలు, 3 కాంస్యాలు)తో కొనసాగుతున్నది.