మాంచెస్టర్: మహిళల టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న టీమిండియా హ్యాట్రిక్‌పై గురి పెట్టింది. ఆదివారం జరిగే గ్రూప్-ఏ పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్.. బలమైన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆ జట్టుపై గెలిచిన హర్మన్‌సేన ఈ పోరులోనూ నెగ్గి సెమీఫైనల్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది.
తొలి రెండు మ్యాచ్‌లో పాకిస్థాన్ (64 పరుగుల తేడాతో), నెదర్లాండ్స్ (95 రన్స్)పై ఘన విజయాలతో భారత్ ఉత్సాహంగా ఉంది. మరోవైపు సఫారీ తమ తొలి పోరులో. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. ఆపై పాక్‌పై 2 వికెట్ల తేడాతో గట్టెక్కింది. దాంతో సఫారీల పని పట్టి హ్యాట్రిక్ అందుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.