Ricky Ponting | ఢిల్లీ: ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి ఈ లీగ్‌లో ఆడుతున్నా ఇప్పటి దాకా టైటిల్ నెగ్గని జట్లలో ఒకటైన పంజాబ్ కింగ్స్ మరోసారి హెడ్‌కోచ్‌ను మార్చింది. ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రికీ పాంటింగ్‌ను తమ హెడ్‌కోచ్‌గా నియమించుకుంది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. పాంటింగ్ నాలుగేండ్ల పాటు పంజాబ్‌కు కోచ్‌గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిపింది. ట్రెవర్ బైలిస్ స్థానంలో హెడ్‌కోచ్ బాధ్యతలు చేపట్టనున్న పాంటింగ్‌కు కోచింగ్ సిబ్బంది విషయంలో పంజాబ్ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు తెలుస్తోంది. గత ఏడేండ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా పనిచేసిన పాంటింగ్.. 2025 సీజన్ నుంచి కొత్త ఫ్రాంచైజీకి సేవలందించనున్నాడు.