Rani Rampal | ఢిల్లీ: భారత హాకీ జట్టు మాజీ సారథి రాణి రాంపాల్ అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. 16 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు గురువారం తెలిపింది. భారత్ తరఫున 254 మ్యాచ్‌లు ఆడి 205 గోల్స్ చేసిన రాణి.. 14 ఏండ్ల వయసులోనే (2008లో) అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేసింది. హర్యానాలోని అత్యంత పేద కుటుంబంలో పుట్టిన రాణి ఎన్నో ఒడిదొడుకులను దాటుకుని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది.
రాణి సారథ్యంలో భారత జట్టు 2018 హాకీ వరల్డ్‌కప్‌లో క్వార్టర్స్ చేరడమే గాక అదే ఏడాది ఆసియా క్రీడల్లో రజతం నెగ్గింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలవడంలోనూ రాణి పాత్ర కీలకం. 29 ఏండ్ల వయసులోనే కెరీర్‌కు గుడ్ బై చెప్పిన రాణిని 2020లో కేంద్ర ప్రభుత్వం మేజర్ ద్యాన్‌చంద్ ఖేల్త్న్రతో పాటు పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది.