రాజ్‌గిర్(బీహార్): ప్రతిష్టాత్మక ఆసియాకప్‌లో ఫైనల్ బెర్తు దక్కించుకునేందుకు ఆతిథ్య భారత్ మరో అడుగు దూరంలో ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో అదరగొడుతున్న టీమ్ఇండియా శనివారం..చైనాతో తమ ఆఖరి సూపర్-4 లీగ్ మ్యాచ్ ఆడనుంది. టోర్నీలో సూపర్ ఫామ్ మీదున్న భారత్..చైనాపై గెలిచి ఫైనల్ బెర్తు దక్కించుకోవాలని చూస్తున్నది.
కొరియాతో తమ తొలి పోరును 2-2తో డ్రా చేసుకున్న హర్మన్‌ప్రీత్‌సింగ్ సారథ్యంలోని భారత్..మలి మ్యాచ్‌లో మలేషియా 4-1తో చిత్తు చేసింది. అదే జోష్‌లో చైనాను మట్టికరిపించి టైటిల్ వేటలో మరింత ముందంజ వేయాలని చూస్తున్నది. భారత్ ప్రస్తుతం నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, మలేషియా(3), చైనా(3), కొరియా(1) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.