చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ షియోమీ త్వరలో భారత్లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది.
రెడ్మీ నోట్ 10ఎస్ పేరుతో వస్తోన్న ఫోన్ను మే 13న భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నారు.
కొత్త ఫోన్ అద్భుత సామర్థ్యంతో పనిచేస్తుందని అందులో స్టన్నింగ్ కెమెరా ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది. హైపర్ ఇంజిన్ గేమ్ టెక్నాలజీతో ఫోన్ను రూపొందించినట్లు కంపెనీ వివరించింది. ఫోన్ ధర 13వేల లోపే ఉండనుందని తెలుస్తోంది. బ్లూ, డార్క్ గ్రే, వైట్ కలర్లలో ఫోన్ విడుదలకానుంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి.
డిస్ప్లే: 6.43 అంగుళాలు
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ95
ఫ్రంట్ కెమెరా: 13 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 64+8+2+2 మెగా పిక్సెల్
ర్యామ్:6GB
స్టోరేజ్: 64GB
బ్యాటరీ కెపాసిటీ:5000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11
Savage never looked this Stunning! Ready up for the new player in town. #RedmiNote10S is all-set to arrive on 13.5.21 at 12 noon!
— Redmi India – Redmi Note 11S (@RedmiIndia) May 3, 2021
Stay tuned for the latest entrant in the #RedmiNote10Series. #SavagePerformance meets #StunningCamera! 😎
Tap to keep a tab: https://t.co/vUC5szyJLA pic.twitter.com/rrpBB05ASm