WTC Final : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది ఆస్ట్రేలియా. టెస్టు గద (Test Mace)ను వశం చేసుకునేందుకు సిద్ధమవుతున్న సఫారీలు 282 రన్స్ కొడితే చరిత్ర సృష్టిస్తారు. తొలిసారి ఐసీసీ ఫైనల్లో విజేతగా కొత్త అధ్యాయాన్ని లిఖిస్తారు. అయితే.. ఛాంపియన్ ట్యాగ్ కల సాకారం కావాలంటే లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా ఆడాల్సిందే.
కానీ, లార్డ్స్‌లో ఇప్పటివరకూ 280 ప్లస్ లక్ష్య ఛేదన రెండుసార్లు మాత్రమే సాధ్యమైంది. రికార్డులు అనుకూలంగా లేనప్పటికీ ఈ సీజన్లో తెంబ బవుమా(Temba Bavuma) జట్టు భీకర ఫామ్‌లో ఉంది. ఈ మధ్యే 250 ప్లస్ లక్ష్యాన్ని ఐదుసార్లు సునాయసంగా చేరుకుంది. వీటిలో మూడు ఆస్ట్రేలియాపైనే కావడం విశేషం.
పెర్త్ మైదానంలో 2008లో 414 రన్స్ కొట్టి ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది సఫారీ టీమ్. సో.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ నిర్దేశించిన 282 రన్స్ కొట్టడం ఏమంత కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే.. టాపార్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకూ బ్యాట్ ఝులిపించగల ఆటగాళ్లు ప్రస్తుతం జట్టులో ఉన్నారు. కంగారూ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్ మీద టెయిలెండర్లు ఏమాత్రం కష్టపడకుండా పరుగులు సాధించగా.. వరల్డ్ క్లాస్ బ్యాటర్లున్న ప్రొటీస్ టీమ్ టెస్టు గదను ముద్దాడడం సాధ్యమే అనిపిస్తోంది.
A target of 282 or more has only been successfully chased twice in the history of Test cricket at Lord’s 👀 pic.twitter.com/uaF8xiR3vM
— ESPNcricinfo (@ESPNcricinfo) June 13, 2025
లార్డ్స్‌లో అత్యధిక ఛేదన రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. 1984లో ఇంగ్లండ్ నిర్దేశించిన 342 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఒకే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. 2022లో న్యూజిలాండ్ 277 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల కోల్పోయి ఛేదించింది. అయితే.. 2004లో న్యూజిలాండ్ 282 పరుగులను అందుకోలేక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 1965లో కివీస్ 216 టార్గెట్‌ను సునాయసంగా పూర్తి చేసింది. 2012లో వెస్టిండీస్ 191 పరుగులను విజయవంతంగా ఛేదించి ఇంగ్లండ్‌కు షాకిచ్చింది.
South Africa’s last successful chase of a 250+ target in a Test was in 2008, when they chased 414 against Australia at the WACA 👀 pic.twitter.com/YwijmNJs2W
— ESPNcricinfo (@ESPNcricinfo) June 13, 2025
తొలి రోజు నుంచి ఊహించని మలుపులతో ఆసక్తి రేపుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్
క్లైమాక్స్‌కు చేరింది. రెండు రోజులుగా ఆధిపత్యం చేతలు మారుతూ వచ్చిన పోరులో విజేత ఎవరో తేలిపోనుంది. తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌తో మ్యాచ్‌పై పట్టు బిగించింది. సఫారీ పేసర్లు కబిసో రబడ(4-59), లుంగి ఎంగిడి(3-38)ల ధాటికి ప్రధాన బ్యాటర్లు పెవిలియన్ చేరినా.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(43), మిచెల్ స్టార్క్(58 నాటౌట్)ల అసమాన పోరాటంతో జట్టును ఆదుకున్నారు.
మిచెల్ స్టార్క్ (58 నాటౌట్)
సఫారీ పేసర్లకు ఎదురొడ్డిన ఈ జోడీ రెండో పట్టుదలగా ఆడింది. మూడో రోజు లియన్(2)ను రబడ ఔట్ చేశాక హేజిల్‌వుడ్(17) జతగా స్కార్ట్ ప్రత్యర్థి బౌలర్లను విసిగించాడు. అజేయ అర్ధ శతకం బాదిన ఈ స్పీడ్‌స్టర్ పదో వికెట్‌కు 59 రన్స్ రాబట్టాడు. మరికాసేపట్లో లంచ్ అనగా ఈ ద్వయాన్ని.. మర్క్రమ్ విడదీశాడు. దాంతో, 207 వద్ద కంగారూ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. తొలిసారి ఐసీసీ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న దక్షిణాఫ్రికాకు విజయం కోసం 282 పరుగులు అవసరం. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్ మీద సఫారీ బ్యాటర్లు నింపాదిగా ఆడితే టెస్టు గదను ముద్దాడడం సాధ్యమేనంటున్నారు విశ్లేషకులు.