IPL 2025 : ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. క్వాలిఫయర్ 1పై గురి పెట్టిన ఆర్సీబీ మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్(LSG)ను ఢీకొడుతోంది. లక్నో వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన ఆర్సీబీ సారథి జితేశ్ శర్మ (Jitesh Sharma) బౌలింగ్ తీసుకున్నాడు.
విజయంపై కన్నేసిన ఇరుజట్లు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. టిమ్ డేవిడ్ స్థానంలో లివింగ్‌స్టోన్.. ఎంగిడి బదులు తుషారను ఆర్సీబీ తీసుకుంది. ఇక.. లక్నో తుది జట్టులో బ్రీట్జ్కే, దిగ్వేశ్ రథీలు చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం 17 పాయింట్లతో ఉన్న ఆర్సీబీకి ఈ మ్యాచ్ చాలా కీలకం. గత పోరులో సన్‌రైజర్స్ చేతిలో ఓడిన బెంగళూరు టేబుల్ టాపర్ అయ్యే అవకాశం చేజార్చుకుంది. దాంతో.. ఇప్పుడు రజత్ పాటిదార్ బృందానికి లక్నోపై గెలిచితీరాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆర్సీబీ తుది జట్టు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పటిదార్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ(కెప్టెన్, వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, యశ్ దయాల్, నువాన్ తుషార.
ఇంప్యాక్ట్ సబ్స్ : సుయాశ్ శర్మ, రసిక్ దార్ సలాం, మనోజ్ భాండగే, టిమ్ సీఫర్ట్, స్వప్నిల్ సింగ్.
🚨 Toss 🚨 @RCBTweets won the toss and elected to field against @LucknowIPL
Updates ▶️ https://t.co/h5KnqyuYZE #TATAIPL | #LSGvRCB pic.twitter.com/MRrMKlH7nm
— IndianPremierLeague (@IPL) May 27, 2025
లక్నో తుది జట్టు : మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బదొని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షహబాజ్ అహ్మద్, దిగ్వేశ్ రథీ, అవేశ్ ఖాన్, విలియం ఓ రూర్కీ.
ఇంప్యాక్ట్ సబ్స్ : ఆకాశ్ సింగ్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షిన్ కులకర్ణి, యువరాజ్ చౌదరీ.